అతిథి పాత్రకు రజినీకాంత్ షాకింగ్ రెమ్యూనరేషన్.. ఏడు రోజులకే అన్ని కోట్లా.. !

-

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన 70 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అలాగే రెమ్యునరేషన్ కూడా కోట్లలో తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఒక సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం..యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్ల వయసులో సైతం తన స్టైల్ ను చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ వయసులో కూడా అతని క్రేజ్, ఇమేజ్, సినిమాలు ఏ మాత్రం తగ్గలేదు..

అలాగే ఒక సినిమాకి అతను తీసుకునే రెమ్యూనరేషన్ సైతం 100 కోట్లకు పైమాటే. ఇప్పటివరకు ఎంతమంది స్టార్ హీరోలు వచ్చిన తమిళంలో రజనీకాంత్ ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు.అయితే రజనీకాంత్ దాదాపు అతిధి పాత్రలు చేయటానికి ఇష్టపడరు. కానీ ఒక సినిమాలో మాత్రం గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం అతని గారాల తనయ ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో రజిని అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రజినీకాంత్ కాల్షిట్లు ఏడు రోజులకు అడగ్గా అతను షాకింగ్ రెమ్యూనరేషన్ కోరినట్టు సమాచారం. దాదాపు పాతి కోట్ల వరకు ఏడు రోజులకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు మాత్రం రజనీకాంత్ ఇమేజ్ అలాంటిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా 140 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంట సూపర్ స్టార్..

Read more RELATED
Recommended to you

Exit mobile version