ఒమిక్రాన్‌ టెర్రర్‌…దేశంలో 3 వేలు దాటిన కేసుల సంఖ్య

-

దక్షిణాఫ్రికాలో దేశం లో పురుడు పోసుకున్న ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఇండియాలో క్రమ క్రమంగా విజృంభిస్తోంది. ఇండియాలోనూ ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు భారత్‌ లో ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 3007 కి చేరింది. అలాగే 1199 మంది ఓమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కేరళలో 284, రాజస్థాన్ లో 291, గుజరాత్ లో 204, తమిళనాడు లో 121, తెలంగాణ లో 107, కర్ణాటకలో 333, హర్యానాలో 114, ఒడిసా 60, ఉత్తర ప్రదేశ్‌ 31, వెస్ట్‌ బెంగాల్‌ 27, గోవా 19, అస్సాం 9, మధ్య ప్రదేశ్‌ 09 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 కేసులు నమోదయ్యాయి.

మొత్తం ఇండియా వ్యాప్తంగా 27 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. కాగా తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో మొత్తం 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా రోజుల తరువాత దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు రావడం ఇదే మొదటిసారి. వారం క్రితం రోజుకు కేవలం 10 వేల లోపలే ఉన్న కరోనా కేసుల.. వారం వ్యవధిలో లక్షను దాటాయంటే పరిస్థితి తీవ్రత ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version