నెంబర్ ప్లేట్స్ లో చాలా రంగులు ఉన్నాయి. అయితే అసలు ఈ రంగుల వెనుక అర్థం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి. సహజముగా వైట్ నెంబర్ ప్లేట్ ని తరచూ మనం చూస్తాం. దానిపై బ్లాక్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇది ఒక్కటే కాదు వీటిలో రకాలు ఉన్నాయి. మరి వాటిపై కూడా ఒక లుక్ వేసేయండి. రెగ్యూలర్ గా మనం చూసే వాహనాలకు వైట్ ప్లేట్లు బ్లాక్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఉండేవి అన్ని ప్రైవేట్ లేదా నాన్ కమర్షియల్ కార్లకు మాత్రమే.
న్యూఢిల్లీ లో ఉండే రిజిష్టర్డ్ మిలటరీ వెహికల్ కు పైకి వెళ్లే బాణం గుర్తు తో కనిపించే నెంబర్ ప్లేట్ ని ఉపయోగిస్తారు. ఆ కోడ్ లో ఒక్కో డిజిట్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. రెడ్ ప్లేట్ మీద తెల్లని అక్షరాల తో ఉన్న ప్లేట్ ను టెంపరరీ రిజిష్ట్రేషన్ కింద వాడతారు. ఈ టెంపరరీ రిజిస్ట్రేషన్ ఒక నెల మాత్రమే వ్యాలిడ్ గా ఉంటుంది.