సిరిసిల్ల స్కూల్ లో క్షుద్రపూజల కలకలం

-

ఓ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ సంఘటన కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో ఉన్న కుసుమ రామయ్య పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో… కొంతమంది దుండగులు…. క్షుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది.

black magic, siricilla, telangana

సిరిసిల్ల కుసుమ రామయ్య పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మేక బలి ఇచ్చేందుకు ప్రయత్నాలు… చేసినట్లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం ఐదు గంటలకు స్కూల్ గేట్ తెరవడంతో… అసలు విషయం బయటపడింది. ఈ సంఘటనపై… రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం వెంటనే… స్థానికులకు తెలిపారు. అనంతరం ఎంఈఓ రఘుపతి కి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news