ఏపీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం అమలులోకి వచ్చింది. నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుంది. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా.. ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ మేరకు ఇవాల ఉ.10 గంటలకు మంత్రి అనగాని తొలి విడతగా 26 జిల్లా లో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభించారు.

మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరు లోగా అమలులోకి రానున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. పలు కీలక అంశాలపై చర్చించారు. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.