హవ్వా…మినిస్టర్ కూతురు బరితెగింపు వైరల్ అవుతున్న వీడియో..!

-

మినిస్టర్ కూతురుని నాకేంటి అనుకున్న ఓ యువతి హద్దులు మీరింది. ఆమె చేసిన ఓ వీడియో ట్విట్టర్ లో ప్రత్యక్షం అవ్వడంతో ఇప్పుడు చుక్కుల్లో పడింది. దాంతో ఇప్పుడు సదరు మినిస్టర్ గారు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు మీడియా కంట పడకుండా తప్పించుకుంటున్నారట. అసలు ఏమి జరిగింది..?? ఇంతకీ ఆ మినిస్టర్ ఎవరు..?? ఆయన కూతురు ఏమి చేసింది అనే వివరాలలోకి వెళ్తే..

ఓడిసా ఆరోగ్య మంత్రిగా ఉన్న నాబా కిషోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్ ఓడిసాలోని నిషేధిత ప్రాంతం అయిన హీరాకుడ్ రిజర్వాయర్ దగ్గరకు తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. మూడు ఓడిసా చిత్రాలలో కూడా ఆమె నటించింది. సహజంగా ఆమె నటి కావడంతో తన తోటి నటీ మణులతో కలిసి ఆ ప్రాంతంలో ఫోటో షూట్ చేయడమే కాకుండా ఆట పాటలతో ఓ వీడియో చేసింది.

ఈ వీడియోని మరొక నటి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దాంతో ఒక్క సారిగా బగ్గుమన్నాయి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మినిస్టర్ కూతురు అయితే ఎవరూ వెళ్ళకూడని ప్రాంతంలోకి వెళ్ళిపోతుందా. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం అంటూ దుయ్యబట్టాయి. దాంతో స్పందించిన ఆ ప్రాంత ఎస్పీ  ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని స్థానిక ఎస్సై ని ఆదేశించారు. నేరం రుజువయితే చర్యలు తీసుకుంటామని నివేదిక వచ్చాక అన్ని విషయాలు చెప్తామని అన్నారు ఎస్పీ. ఇదిలాఉంటే ఈ విషయంపై స్పందిచడానికి మంత్రి నిరాకరించారు. అందరి రాజకీయ నేతలుగానే చట్టం తనపని తానూ చేసుకుంటుంది అంటూ మీడియాని తప్పించుకుని  వెళ్ళిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version