ఒడిషా రైలు ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రమాద బాధితుల కోసం అందరూ దేవునికి ప్రార్దనలు చేస్తున్నారు. ప్రాణాలతో పోరాడుతున్న ఎందరో ప్రయాణికులు బ్రతకాలని ఆశిస్తున్నారు. కాగా ఈ ఘటన గురించి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఒక రైలు డ్రైవర్ అజాగ్రత్త వలన వందల మంది ప్రాణాలను కోల్పోయారని బాధపడ్డారు. కాగా ఇందు కోసం ఈయన తనతో పాటు ఉన్న మిగిలిన ఎంపీ లను సాయం చేయాలని కోరారు. అందులో భాగంగా ఎంపీ లకు అందే జీతంలో కొంతభాగాన్ని ఈ బాధిత కుటుంబాలకు అందించే దిశగా మంచి ఆలోచన చేశారు. మరి ఈయన బాటలో అందరూ ఎంపీలు సహాయం చేస్తారా చూడాలి.