టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్‌గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. కాన్పూర్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతున్నది. మ్యాచ్ ఆఖరి రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టడంతో అతని ఖాతాలో 417 టెస్టు వికెట్లు చేరాయి. దీంతో టెస్టులో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిని క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు వెటర్నర్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619) పేరిట ఉన్నది. అతని తర్వాత కపిల్ దేవ్ 434 వికెట్లుతో రెండో స్థానంలో కొనసాగున్నాడు. మూడో స్థానంలో ఉన్న హర్భజన్ సింగ్(417) రికార్డును రవిచంద్రన్ సమం చేశాడు. మొత్తం 150 ఇన్నింగ్స్‌లో అశ్విన్ 417 వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ 190 టెస్టు ఇన్నింగ్స్‌లో సాధించాడు. బౌలింగ్ సగటు సైతం హర్భజన్ (32.46) కంటే అశ్విన్(24.52)దే మెరుగ్గా ఉన్నది.