ఓటీటీలోకి శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

చాలా రోజుల తర్వాత యంగ్ హీరో శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్‌ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజైంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌కు అమ్మ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు శ్రీకార్తిక్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అంతే అద్భుతంగా శర్వానంద్ ఈ సినిమాలో బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడూ అని ఎదురూచూస్తున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ చిత్రం గత రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. సై-ఫై డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ నిర్మించారు. అక్కినేని అమల కీలకపాత్రలో నటించింది. శర్వాకు జోడీగా రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి జేక్స్‌ బేజోయ్ సంగీతం అందించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version