గచ్చిబౌలి స్టేడియం వద్ద క్యాబ్ డ్రైవర్ల ఆందోళన..!

-

గచ్చిబౌలి స్టేడియం వద్ద 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కిలోమీటర్ కి 18 నుండి 20 రూపాయలు చెల్లించేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఓలా ఉబర్ కంపెనీలు. కానీ ప్రస్తుతం 6 నుంచి 9 రూపాయలు కేటాయిస్తున్నాయి. కంపెనీలు మాకు వచ్చిన చార్జెస్ లో నుండి 30% కమిషన్ తీసుకుంటున్నాయి. ఇంతకుముందు గచ్చిబౌలి నుండి ఎయిర్పోర్ట్ వెళితే 600 రూపాయలు పే చేసే కంపెనీలు.. ప్రస్తుతం 300 నుండి 350 రూపాయలు చెల్లిస్తున్నాయి. దాంతో 30 కిలోమీటర్లకు 350 రూపాయలు సరిపోవటం లేదంటూ ఆందోళన చేస్తున్నారు డ్రైవర్లు.

పాత తరహాలోనే కిలోమీటర్ కి 18 నుండి 20 రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న డ్రైవర్లు.. ఇతర రాష్ట్రాల వాహనాలు ఓలా ఉబర్ లలో నడవడంతో మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదాపూర్ నుండి ఎయిర్పోర్ట్ వెళితే కస్టమర్ దగ్గర నుండి 850 రూపాయలు వసూలు చేస్తున్న కంపెనీలు.. మాకు మాత్రం అదే ట్రిప్పుకు 450 రూపాయలు చెల్లిస్తున్నాయి. ఒక ట్రిప్పు పై 400 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాయి అని క్యాబ్ డ్రైవర్లు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news