వ్యాక్సిన్ తీసుకున్నా ఓమిక్రాన్ సోకుతుంది : యూఎస్ డాక్ట‌ర్ ఫౌచీ

-

క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా.. ఓమిక్రాన్ వేరియంట్ సోకుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌ధాన వైద్య స‌ల‌హాదారుడు, అంటు వ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ అంటోని ఫౌచీ అన్నారు. కొద్ది రోజుల్లోనే ఓమిక్రాన్ ప్రపంచాన్ని చుట్టివేస్తుంద‌ని హెచ్చ‌రించారు. సాధార‌ణ క‌రోనా వేరియంట్ల క‌న్న ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అన్నారు. రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఇన్ ఫెక్ష‌న్స్ పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు.

త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. అమెరికన్లు త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌ని తెలిపారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ దాదాపు 90 దేశాల‌కు విస్త‌రించినా.. అమెరికా లో మాత్రం ఎక్కువ సంఖ్య లో కేసులు వ‌స్తున్నాయి.అమెరికా లో దాదాపు సగానికి పైగా రాష్ట్రాల‌లో ఓమిక్రాన్ వ్యాపించింది. దీంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version