ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కల్లోలం…63 దేశాలకు విస్తరించిన మహమ్మారి.

-

ప్రపంచ దేశాలు ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కంగారుపడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు ఓమిక్రాన్ పాకింది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ ఓమిక్రాన్ వేరియంట్ తక్కువ కాలంలోనే చాలా దేశాలకు విస్తరించింది. ముందుగా ఓమిక్రాన్ ప్రభావిత దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినా.. విదేశీయులకు బార్డర్ల క్లోజ్ చేసినా..ఓమిక్రాన్ విస్తరణ ఆగడం లేదు. ఓమిక్రాన్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసుల్లో ఎక్కడా ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం కొంత ఊరట కలిగించే అంశం.

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచంలోని 66 దేశాలకు విస్తరించింది. ప్రపంచంలో 5634కు కేసుల సంఖ్య పెరిగింది. బ్రిటన్ లో ఓమిక్రాన్ కల్లోలం కలిగిస్తుంది. అత్యధికంగా అక్కడే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికి బ్రిటన్ దేశంలో 1898 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ తో పాటు డెన్మార్క్  లో 1840, దక్షిణాఫ్రికా లో 633, అమెరికాలో 111 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోొ వైపు ఇండియాలో కూడా నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో 33 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version