దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఓమిక్రాన్ వేరియంట్… ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త వైరస్ ఇప్పటికే… ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందింది. ఏకంగా 99 దేశాలకు ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇది ఇండియాలోని ఈ కొత్త వేరీయంట్ కూడా విజృంభిస్తోంది. అయితే ఈ ఓమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అమెరికాలోని బాధితుల్లో ఏకంగా 22 శాతం మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగించే అంశం. భారతదేశంలోనూ అదే తీరులో అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా మనల్ని వదిలి పెట్టే పరిస్థితి లేదని… 6 నెలలకోసారి బూస్టర్ డోసు తీసుకోక తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు.