కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాల పై పంజా విసురుతుంది. క్రమ క్రమం గా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందేలా ఓమిక్రాన్ దాడి చేస్తుంది. బుధ వారం మరి కొన్ని దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు లో కి వచ్చాయి. అమెరికా తో పాటు దక్షిణ కొరియా వంటి దేశాలలో బుధ వారం కొత్త గా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వచ్చాయి. వీటి తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తం గా మొత్తం 26 దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది.
23 దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. రోజుల గడుస్తున్న కొద్ది ఈ సంఖ్య మరింత గా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే టెడ్రోస్ ప్రకటన తర్వాత కొద్ది సమయంలో మరో మూడు దేశాలలో ఓమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో సంఖ్య 26 కు చేరింది. అమెరికా తో పాటు యూఏఈ, సౌది అరేబియా దేశాలలో బుధ వారం కొత్త గా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి.