సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ క‌ల‌క‌లం

-

తెలంగాణలోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ వేరియంట్ క‌లక‌లం రేపింది. జిల్లాలో ఓమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూడటం తో జిల్లా ప్ర‌జలు భ‌య‌ప‌డుతున్నారు. కాగ రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలోని ముస్తాబాద్ మండ‌లం గూడెం అనే గ్రామంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. ఓమిక్రాన్ బాధితుడు ఇటీవ‌ల ఈ నెల 16 న దుబాయ్ నుంచి సొంత గ్రామానికి వ‌చ్చినట్టు తెలుస్తుంది. కాగ బాధితుడు గ‌త కొద్ది రోజుల ఆనారోగ్యంతో ఉంటే వైద్యులు ప‌రీక్ష‌లు జ‌రిపి ఓమిక్రాన్ గా గుర్తించారు.

దీంతో ఓమిక్రాన్ సోకిన వ్య‌క్తిని చికిత్స కోసం హైద‌రాబాద్ లోని టిమ్స్ ఆస్ప‌త్రికి వైద్యులు త‌ర‌లించారు. కాగ రాజ‌న్న‌ సిరిసిల్ల జిల్లాలో న‌మోదు అయిన ఈ కేసు తో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. అయితే ప్ర‌జ‌లు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తే.. ఓమిక్రాన్ త‌ర‌మి కొట్ట‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ రెండు డోసుల క‌రోనా వైర‌స్ టీకాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version