దేశంలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు

-

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 156 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కేసుల్లో ఒక్క రోజులోనే 37 శాతం పెరుగుదల నమోదు కావడం ఆందోళనలను రేకెత్తిస్తున్నది. ఆదివారం నాటికి దేశంలో 422 ఒమిక్రాన్ కేసులు ఉండగా, వీటి సంఖ్య సోమవారం 578కి చేరుకున్నది. కేసుల పెరుగుదల నేపథ్యంలో థర్డ్ వేవ్ రావచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి.

దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు దేశ రాజధాని న్యూఢిల్లీ(142)లో నమోదయ్యయి. ఆ తర్వాత మహారాష్ట్ర(14), కేరళ (57), గుజరాత్ (49), రజస్తాన్ (43) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం కరోనా కేసులు 6531 వెలుగు చూశాయి. నిన్నటి(ఆదివారం)తో పోలిస్తే కేసుల పెరుగుదలలో 6.7శాతం నెలకొన్నది. ప్రస్తుతం దేశంలో 75,481 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కేసుల సంఖ్య తగ్గిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేశాయి. పండుల సీజన్ మొదలు కావడం, పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతుండటంతో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version