ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

-

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు కేటీఆర్. భారీ బహిరంగ సభ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తాం.  ఏడాది మెదటి హాఫ్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించారు.

అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రేనా..? బీఆర్ఎస్ హయాంలో రైతులకు రైతుబంధు సంవత్సరానికి రెండు సార్లు ఇచ్చేవాళ్లం. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం అది అమలు కావడం లేదనే చెప్పాలి. ఇప్పటివరకు పేద రైతులకు రైతుబంధు ఇవ్వలేదని.. మరోవైపు సంక్రాంతి తరువాత, అప్పుడు, ఇప్పుడూ అని చెప్పుకుంటూ పోవడమే తప్పా ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version