2023 అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు గాజా నుంచి ఇజ్రాయిల్లోకి చొరబడి దారుణమై దాడి చేశారు.
సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కమ్యూనిటీలను టార్గెట్ చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా దారుణంగా చంపేశారు. పడుకొని ఉన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అత్యంత కిరాతకంగా ఇజ్రాయిలీలను హతమార్చారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా, 251 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం హమాస్ లక్ష్యంగా గాజాతో పాటు ఇతర పాలస్తీనా భూభాగాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 45 వేలకు పైగా ప్రజలు మరణించారు.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 07న కిబ్బట్జ్ నిర్ ఓజ్ దాడికి నాయకత్వం వహించిన హమాస్ కమాండర్ని హతమార్చినట్లు ఇజ్రాయిల్ ధ్రువీకరించింది. అబ్ద్ అల్- హదీ సబా అనే వ్యక్తి హమాస్ నుఖ్బా ఫ్లాటూన్ కమాండర్గా వ్యవహరించాడు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హమాస్ యొక్క ముఖ్బా ప్లాటూన్ కమాండర్, అబ్ద్ అల్-హదీ సబా ఇటీవలి డ్రోన్ దాడిలో హతమైనట్లు ధృవీకరించింది.