కాబూల్‌లో మరోసారి బాంబుల మోత.. 8 మంది మృతి

-

మరోసారి బాంబుల మోతతో అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ దద్దరిల్లింది. కాబూల్‌లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్‌ వీధిలో
శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో 8 మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. దేశంలో మైనార్టీలైన షీయెట్‌ ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు కలుసుకునే ప్రాంతంలో బాంబు పేలిందని అధికారులు వెల్లడించారు. ఈ బాంబు దాడికి ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)కు చెందిన సున్ని ముస్లిం గ్రూప్‌ బాధ్యతవహిస్తూ ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారని, 22 మంది తీవ్రంగా గాయపడ్డారని వైద్యులు వెల్లడించారు.

కాగా, శుక్రవారం కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 18 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే.. మొన్నామధ్య కూడా సిక్కులను లక్ష్యం చేసుకొని బాంబా దాడులు జరిగాయి. అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్ల చేతిల్లోకి వెళ్లిననాటి నుంచి అక్కడి సిక్కులను అనిచివేసేందుకు తాలిబన్లు బాంబు దాడులకు పాల్పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version