సామన్యులకు షాక్‌.. మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర

-

సామాన్యులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్‌, డిజీల్‌ ధరలు ఆకాశంటుతున్నాయి. ఇప్పుడు మరోసారి సిలిండర్‌ ధరలు పెంచి సామాన్యుడు నడ్డి విరిచేందుకు సిద్ధమైంది కేంద్ర సర్కార్‌ . తాజాగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ. 50 పెంచితూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1055లు ఉండగా దీనిపై రూ. 50 అదనంగా పెంచడంతో రూ.1105కు చేరింది. దీంతో సామాన్యులపై పెనుభారం పడనుంది.

వంట గ్యాస్‌గా ఉపయోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ధరల్లో ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంది భారత్. విదేశీ మారక నిల్వలు అంతంతమాత్రంగానే ఉండే పేద దేశాల కన్నా కూడా భారత్‌లోనే గ్యాస్‌పై బాదుడు తీవ్రంగా ఉంది. యుద్ధంతో అస్తవ్యస్తమైన ఉక్రెయిన్, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో పోల్చినా భారత్‌లోనే గ్యాస్ ధర చాలా ఎక్కువగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ దేశాల కన్నా భారత్‌లో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ ధరలు మాత్రం పెంచుతూనే ఉంది కేంద్ర సర్కార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version