వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

-

క్రూడాయిల్ ధరలు గ్లోబల్ మార్కెట్లో భగ్గుమంటోన్న తరుణంలో.. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల డేటాను విడుదల చేశాయి. నేడు విడుదల చేసిన సమాచారంలో హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధరపై 17 పైసలు పెరగడంతో.. లీటరు రూ.119.66కు చేరుకుంది. గురువారం ఈ ధర రూ.119.49గా ఉంది. అలాగే డీజిల్ ధర కూడా హైదరాబాద్‌లో రూ.105.49 నుంచి రూ.105.65కు చేరుకుంది. గత నెల రోజులకు పైగా స్థిరంగా ఉంటూ వచ్చిన ధరలు.. నేడు పెరిగి వాహనదారులకు షాకిచ్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ 109 డాలర్లుగా నమోదైంది. డబ్ల్యూటీఐ బ్యారల్‌కు 107.4 డాలర్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా ఇక రేట్ల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. లీటరు పెట్రోల్ ధర స్థిరంగా రూ.105.41 వద్ద, లీటరు డీజిల్ ధర రూ.96.67 వద్ద ఉంది. ఇతర ప్రధాన నగరాలు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఒక్క హైదరాబాద్‌లోనే ధరలు పెరిగాయి. మెల్లమెల్లగా ధరలను పెంచడం మొదలుపెట్టినట్టు కంపెనీలు సంకేతాలిస్తున్నాయి. ఇక పోతే ఏపీలో పలు ప్రాంతాలో పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగిశాయి. విశాఖపట్నంలో అయితే లీటరు డీజిల్ ధర రూ.105.65 నుంచి రూ.105.93కు పెరిగింది. అలాగే లీటరు పెట్రోల్ ధర రూ.120 నుంచి రూ.120.30కు ఎగిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version