ఇంటిని ఖాళీ చేయాలంటూ.. రాహుల్‌గాంధీ నోటీసులు

-

ఇటీవల సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటిస్తూ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వయనాడ్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి కేటాయించిన ఇంటిని ఖాళీ చేయాలంటూ లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. మార్చి 27వ తేదీ సోమవారం ఈ మేరకు రాహుల్ గాంధీకి సమాచారం ఇచ్చింది ప్యానెల్…రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి మొదటి సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయనకు ఢిల్లీలో తుగ్లక్ రోడులో ఇల్లును కేటాయించారు. అదే ఇంట్లో రాహుల్ ఇప్పటివరకు కొనసాగుతున్నారు.

ఏప్రిల్ 22 లోపు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది ప్యానెల్ . ఇక నుంచి నెలవారీగా అందే జీతం, అలవెన్సులు, ఫోన్ , మెడికల్ సౌకర్యాలు కూడా రద్దు కానున్నాయి. అనర్హత వేటు పడిన ఎంపీకి ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత ఉండే అర్హత లేదని ప్యానెల్ స్పష్టం చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన.. రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం మరో బిగ్ డెసిషన్ తీసుకోవటం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మోడీ పేర్లపై కామెంట్స్ చేసిన కేసులో.. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పుపై అప్పీల్ చేసుకోవటానికి 30 రోజుల గడువు కూడా ఇచ్చింది కోర్టు. తీర్పుపై అప్పీల్ చేసుకునే లోపే.. సూరత్ కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంది. మొన్నటికి మొన్న డిస్ క్వాలి ఫై చేయగా.. ఇప్పుడు ఎంపీగా కేటాయించిన ఇంటికి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version