ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ దశలో మొన్న ఆదివారం రోజున రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే నిన్న యూఏఈ జట్టు పైన గెలిచిన పాకిస్తాన్ సూపర్ 4 కు చేరుకుంది. ఈ నేపద్యంలో మరోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరగనుంది.

ఆదివారం అంటే సెప్టెంబర్ 21వ తేదీన సూపర్ 4 లో భాగంగా ఈ రెండు జట్లు తలపడతాయి. అటు గ్రూపు బి లో ఉన్న శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మూడు జట్టు కూడా సూపర్ 4 కోసం తలపడుతున్నాయి. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఫైట్ ఉంది. ఇందులో ఫలితాన్ని బట్టి జట్లు ఖరారు అవుతాయి.