హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు మృతి చెందారు. దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులు… పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉన్న దిశా పటానీ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

మృతులను రవీంద్ర అలియాస్ కల్లు, అరుణ్ అని పోలీసులు గుర్తించారు. వీరు రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ ముఠాకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇక ఆ నిందితులను పట్టుకునేందుకు యూపీలోని ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో యూపీ పోలీసులు, హర్యానా పోలీసులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితులను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.