పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా చూసేవాళ్లకు ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ OG సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “OG” సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్ షో టికెట్ ధర రూ.1000 ఫిక్స్ చేశారు. 25న విడుదలవుతున్న “OG” సినిమాకు అర్థరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వం.

10 రోజుల పాటు పెంచిన టికెట్ ధరలు అమలులో ఉండనున్నాయి. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “ఓజీ”లో ప్రియాంక మోహన్. ఈ సినిమాకు డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
టిక్కెట్ ధరలు ఒక సారి పరిశీలిస్తే..
సింగిల్ స్క్రీన్: ఒక్కో టికెట్‌పై రూ.125/- (GST సహా)
మల్టీప్లెక్స్: ఒక్కో టికెట్‌పై రూ.150/- (GST సహా)