పెళ్లి ప్రపోజల్‌ పెట్టిన అమ్మాయి రూ. 14 లక్షలతో జంప్‌

-

రోజురోజుకు సైబర్‌ నేరాలకు పాల్పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో వారితో చనువుగా మాట్లాడి, ఆ తర్వాత వారు విసిరే వలలో చిక్కుకొని పోలీస్‌ స్టేషన్లకు పరుగులు పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ యువతి తియ్యని మాటలు కలిపి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ. 14 లక్షలు కాజేసింది. సోషల్‌ మీడియాలో పరిచయంతో మొదలై ప్రేమ, ఆ తర్వాత పెళ్లి ప్రయాణం వరకు తీసుకొచి తాను అనుకున్న డబ్బులు దక్కించుకొని ఉడాయించింది.

ఎవరూ లేరంటూ..

నగరంలోని పద్మారావునగర్‌కు చెందిన అర్జున్‌ అనే యువకుడు సోషల్‌ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, వీడియోలు చేసి ఫేస్‌బుక్, టిక్‌టాక్, ఇన్‌స్టా గ్రామ్‌లలో పోస్ట్‌ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్‌ నెలలో ఘట్టమనేని వర్ణనా మల్లికార్జున్‌ అనే పేరుతో ఓ అమ్మాయి అర్జున్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టగా, అతడు అక్సెప్ట్‌ చేశారు. మెల్లిమెల్లిగా ఇద్దరు ఫోన్‌ నెంబర్లు పంపించుకొని రోజూ వాట్ప్సాప్‌లో చాటింగ్, మాటలు కలిపేవారు. తనకు అమ్మనాన్న ఎవరూ లేకపోవడంతో అక్కే తనతో పాటు తమ్ముడిని పెంచిందని, కేరళలో డెంటిస్ట్‌గా చేసి.. ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్లు అర్జున్‌ను ఆ కిలాడీ లేడీ నమ్మబలికింది.

రెండ్రోజుల్లో పెళ్లి అనగానే..

రోజురోజుకు మరింత ఇరువురి పూర్తి సమచారాలు, కుటుంబ వివరాలు చెప్పుకునేవారు. ఈ క్రమంలో అర్జున్‌కు ఆమె పెళ్లి ప్రపోజల్‌ పెట్టగా, అతడు అంగీకరించాడు. ఆ తర్వాత ఆ లేడీ అసలు రూపం చూపడం ప్రారంభించింది. వివిధ అవసరాల పేర్లతో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. పెళ్లి ఖర్చులు అని నమ్మించి దాదాపు రూ.14 లక్షల వరకు పిండుకుంది. కొన్ని రోజుల తర్వాత సునీత్‌ అనే వ్యక్తిని కూడా అర్జున్‌కు పరిచయం చేసి పెళ్లి తేదీ కూడా ఖారారు చేశారు. మరో రెండు రోజుల్లో పెళ్లి ఉండగా వర్ణణ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో వెంటనే సునీత్‌కు ఫోన్‌ కలపగా ఆ నంబర్‌ కూడా స్విచ్ఛాఫ్‌ రావడంతో మోసపోయినట్లు గుర్తించిన అర్జున్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version