బిలియన్లలో ఒకటి.. ఈ గుడ్డు ధర రూ.78,000.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..?

-

అప్పుడప్పుడు అరుదైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి విషయాలు బయట పడితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వింతలు విచిత్రాలు చోటు చేసుకుంటే సోషల్ మీడియా యూజర్లు వాటిని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు మామూలుగా గుడ్డు కొనాలంటే చాలా తక్కువ ధరకే మనం గుడ్డును కొనొచ్చు. 100 200 కు చాలా గుడ్లు వస్తాయి. వీటి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

కానీ ఈ గుడ్డు మాత్రం వేరే లెవెల్. ఈ గుగ్గు కి స్పెషాలిటీ ఉంది ఈ గుడ్డు ధర వేలల్లోనే పదుల్లో వందల్లో కాదు. మెల్బోర్న్ ఆస్ట్రేలియా సూపర్ మార్కెట్లో చాలా కాలానికి ఇలాంటి గుడ్డు ఒకటి కనపడింది మరి దీని ధర దీని స్పెషాలిటీ గురించి ఇప్పుడే తెలుసుకుందాం… మామూలుగా గుడ్లు గుడ్డు ఆకారంలో ఉంటాయి కానీ ఈ గుడ్డు మాత్రం గుండ్రంగా ఉంది. బిలియన్ గుడ్లలో ఒక గుడ్డు ఇలా గుండ్రంగా ఉంటుంది అని తెలుస్తోంది.

దీని ధర రూ. 78,800 ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఈ గుడ్డు మీద జోకులు కూడా వేసుకుంటున్నారు. సోషల్ మీడియా యూజర్లలో ఒకరు పిల్లలు తినే లేదు హమ్మయ్య యోల్కిడ్డింగ్ అంటూ జోకులు వేస్తున్నారు. మరొక సోషల్ మీడియా యూజర్ అయితే అయ్యో పాపం ఒక కోడి కష్టపడి ఇంత ఖరీదైన గుడ్డుని తీసుకొచ్చింది అంటూ కామెంట్ చేశారు. దీనికే ఆశ్చర్యపోకండి 2013లో ఎలిఫెంట్ బర్డ్ ఎగ్ ని వేలంలో 66,675 పౌండ్లకి పాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version