రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి పోలీసులు అరెస్ట్ చేయడంతో దేశ వ్యాప్తంగా వివాదం రాజుకుంటోంది. ఆర్నాబ్ గోస్వామి ఒక ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అన్నది ఆయన మీద మోపబడిన అభియోగం. అయితే అతన్ని అదుపులోకి తీసుకుకోవడం మీద ఎలాంటి అభంతరాలు లేకున్నా అదుపులోకి తీసుకున్న విధానం మీదే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఆయన ఇంట్లో కి ముంబై, రాయఘడ్ పోలీసులు సంయుక్తంగా ప్రవేశించడంతో పాటు అతని బలవంతంగా తీసుకెళ్ళిన విధానం మీదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆర్నబ్ సహకరించక పోవడం వల్లే పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు తనపై దాడి చేశారని తనను కొట్టారని కూడా ఆర్నాబ్ ఆరోపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎదురు పోలీసులు మళ్లీ ఆర్నాబ్ మీద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం సంచలనంగా మారింది. పోలీసులని దుర్భాషలాడి, తమ డ్యూటీ చేయకుండా అడ్డుకున్నారని పేర్కొంటూ ఆర్నాబ్ మీద ఆయన కొడుకు, ఆయన భార్య మీద కొత్త ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది.