ప్రేమ వ్యవహారంలో ఇంకొకరు బలి..!

-

మండల కేంద్రంలో తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ప్రేమ వ్యవహారంలో ఒక ప్రాణం బలైపోయింది. మహేష్ కత్తి దాడిలో తీవ్రంగా గాయపడ్డ నరసయ్య చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. గత సోమవారం జరిగిన తక్కలపల్లి గ్రామంలో జరిగిన భోగ మహేష్ హత్య తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనలో మహేష్ కత్తి దాడిలో గాయపడిన నరసయ్యని హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స ని అందించారు తీవ్రంగా గాయపడిన నరసయ్య 11 రోజులుగా చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం చనిపోయాడు భోగ మహేష్ కి దూరపు బంధువులైన తక్కలపల్లి గ్రామానికి చెందిన యువతను చూసిన తరుణం నుండి ప్రేమ పేరుతో వేధింపులు కురిచేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు యువకుడి వేధింపులు తాళలేక ఏడాది క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news