ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగాయి. సైబర్ నేరగాళ్ల సంగతి పక్కన పెడితే ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు, రైడ్ పార్ట్నర్స్ సైతం ఒక్కో రోజు, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ధరలు చూపిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి.తాజాగా ఇటువంటి ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది.
ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థ ZEPTO.. ఐఫోన్ యూజర్లకు ఎక్కువ రేటు, ఆండ్రాయిడ్ యూజర్లకు తక్కువ రేటు పెట్టి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు బెంగళూరు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా ఐఫోన్లో నిత్యావసర సరుకులకు ఎక్కువ చార్జీలను జెప్టో వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. తన దగ్గర ఉన్న రెండు ఫోన్లలో జెప్టో యాప్ ఓపెన్ చేసిన బెంగళూరు మహిళ ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా..ఐ ఫోన్లో ఎక్కువ ధరలు చూపించడాన్ని చూసి ఆశ్చర్యానికి గురైంది. ఇటీవలే క్యాబ్ సర్వీసెస్లో సైతం ఇదే తరహాలో రేట్లు చూపిస్తున్నట్లు బెంగళూరు వాసులు వాసులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఐఫోన్ యూజర్లకు ఎక్కువ రేటు.. ఆండ్రాయిడ్ యూజర్లకు తక్కువ రేటు
ఆండ్రాయిడ్ ఫోన్ కన్నా.. ఐఫోన్లో నిత్యావసర సరుకులకు ఎక్కువ ఛార్జీలు చూపిస్తున్న జెప్టో
బెంగళూరుకు చెందిన ఓ మహిళ నిత్యావసరాల సరుకుల కోసం తన దగ్గర ఉన్న రెండు ఫోన్లలో జెప్టో యాప్ ఓపెన్ చేసి చూడగా.. ఆండ్రాయిడ్ ఫోన్… pic.twitter.com/QNqHG3IDEV
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025