త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ 11 ప్రో.. ముందే లీకైన ఫీచర్స్..

-

స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ త్వరలో లాంచ్‌ కానుంది. అదే వన్‌ప్లస్ 11 ప్రో స్మార్ట్ ఫోన్. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు లీక్‌ అయ్యాయి.. వన్‌ప్లస్ 10 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. మరి లీకుల ఆధారంగా ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి..

తాజాగా వస్తున్న వివరాల ప్రకారం…

వన్‌ప్లస్ 11 ప్రోలో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు.
ఫోన్ వెనకవైపే మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఫోన్ వెనకవైపు హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.
వన్‌ప్లస్ 11 ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వన్‌ప్లస్ 11 ప్రో లాంచ్ కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానుందని సమాచారం. ఏకంగా 16 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది. ఈ సంవత్సరం జరగనున్న క్వాల్‌కాం సమ్మిట్ 2022లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 11 ప్రోలో ఈ ప్రాసెసర్‌నే అందించనున్నట్లు తెలుస్తోంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే…

5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ కోసం అందించనున్నారు. వన్‌ప్లస్ 11 ప్రోలో మోస్ట్ అవైటెడ్ అలెర్ట్ స్లైడర్ ఉండనుందని తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 100W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version