మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం SSMB29. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతోంది. రాజమౌళి సినిమా అంటే కాస్త లేట్ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రాజమౌళి తన అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

ఇప్పటివరకు మహేష్ బాబును ఎన్నడూ చూడని విధంగా శ్రీరాముడిగా చూపించబోతున్నట్లుగా ఓ రూమర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటివరకు మహేష్ బాబు ఇలాంటి పాత్రలో నటించలేదు. మహేష్ బాబు శ్రీరాముడు పాత్రలో ఉన్నటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటోను చూసి తన అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాల కోసం శ్రీరాముని పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది.