ఆ రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు

-

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. దీపావళి తర్వాత కాలుష్య తీవ్రత మరీ పెరిగిపోయింది. వాయు నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. ఈ క్రమంలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ఎన్సీఆర్​ కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఈ క్రమంలో చర్యలు చేపట్టిన దిల్లీ సర్కార్.. నోయిడాలోని అన్ని పాఠశాలలను ఈనెల 8వరకు మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలకు సూచించారు. వీలైనంత వరకు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కూడా ఆన్​లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని చెప్పారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీ వాయి కాలుష్యానికి కారణం ప్రజలేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ప్రజలు వీలైనంత వరకు ప్రైవేటు వాహనాలు మానేసి ప్రభుత్వ రవాణాను వినియోగించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version