కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ను ఓడించేందుకు బండి సంజయ్ , రేవంత్ రెడ్డి, షర్మిల ఏకమయ్యారని పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణాను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. మన పిల్లల భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించేది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు. జనం ఆదరణ పొందేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని మంత్రి గంగుల అన్నారు ఆయన. తన చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని వెల్లడించారు మంత్రి గంగుల. ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా తనకు కలిగినట్టేనని తెలిపారు. పార్టీని కార్యకర్తలు కాపాడితే..కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని మంత్రి వెల్లడించారు
సర్వాయి పాపన్న 313 వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ పోరాట పటిమను, ఆయన పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. 300 ఏండ్లకంటే ముందే బహుజన రాజ్యం కోసం గోల్కొండ కోటను బద్దలుకొట్టిన, సింహాసనాన్ని వశపరుచుకున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తుచేశారు. సర్వాయి పాపన్న కేవలం గౌడ కులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి, అన్ని కులాలకు సహకరించిన ధీరుడని చెప్పారు. పెత్తందారులను ఎదురించి పేద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నరని గుర్తుచేశారు.