మాంసం ప్రియులకు ‘ఓన్లీ మీట్’ అందిస్తోన్న గ్రేట్ ఆఫర్స్ అందిస్తోంది. తెలుగురాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఓన్లీ మీట్ హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర నగరాల్లో 40 ఆధునిక మాంసం రిటైల్ దుకాణాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాంసం విక్రయాల్లో ప్రత్యేక స్థానం పొందిన ‘ఓన్లీ మీట్’ మరిన్ని నగరాలకు విస్తరించనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే కంపెనీ రెండు స్టోర్లను పుప్పాలగూడ, మణికొండలో విజయవంతంగా నిర్వహిస్తోంది. కొండాపూర్, చందానగర్, కావూరిహిల్స్‌లో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ విధానంలోకి వచ్చాయి. ఓన్లీ మీట్‌ను యువ వ్యాపారవేత్తలు చైతన్య బోయపాటి, సుమ న్ గద్దె, ఆనంద్ నారా స్థాపించారు.
అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలతో చేపలు, చికెన్, మటన్, రొయ్యలు, గుడ్లు, మసాలాలు, పచ్చళ్ల వంటి 100 రకాల ఉత్పత్తులు ఈ దుకాణాల్లో అమ్ముడవుతున్నాయి. అలాగే 120 రకాల మసాలాలు, సాస్‌లతోపాటు పాయ, షోర్బా, సూప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిలో విదేశీ ఉత్పత్తులూ ఉండడం విశేషం. తాజా మాంసం, వాటి ఆధారిత ఉత్పత్తులకు వ న్ స్టాప్ షాప్‌గా ఓన్లీ మీట్ ప్రాముఖ్యత పొందింది.
సంప్రదాయ మాంసం దుకాణాలకు మహిళలు, పిల్లలు వెళ్లడం లేదు. అక్కడి అపరిశుభ్రంగా ఉంటుంది. ఈ స్థితిని మార్చడానికే ఓన్లీ మీట్ రూపుదిద్దుకుంది. ఎవరైనా సరే మాంస ప్రియులందరూ మా దుకాణాలకు వస్తున్నారు. మేం ఈ వినూత్న ప్రయత్నాలు చేస్తుంది అందుకే. మా దుకాణాలను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. అని కో–ఫౌండర్ చైతన్య బోయపాటి అన్నారు.
వినియోగదారులకు అందుబాటులో ఉండాలని వెబ్‌సైట్, యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్, కెమికల్స్ లేని తాజా మాంసాన్ని మాత్రమే ఓన్లీ మీట్ విక్రయిస్తోంది. శుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫామ్స్ నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫామ్స్‌లో పోషక విలువలున్న ధాన్యాలనే కోళ్లకు ఆహారంగా ఇస్తున్నారు. అదేవిధంగా సహజంగా పెరిగిన మేకలు, గొర్రెలు, చేపలను విక్రయిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మీకు ఫ్రాంచైజీ కావాలంటే..
ఫ్రాంచైజీ కేంద్రాల నిర్వహణకు 700–1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రాంతాన్ని బట్టి రూ.25–35 లక్షల పెట్టుబడి అవసరం. అంతేకాదు ఫ్రాంచైజీ ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అందించడానికి కంపెనీ కూడా కృషి చేస్తోంది.