గ్రేటర్‌ ప్రచారానికి రెండు రోజులే సమయం..అగ్రనేతల ర్యాలీలతో హీటెక్కిన భాగ్యనగరం.

-

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికల రంగంలోకి అగ్రనేతలను దించుతున్నాయి..ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు క్యూ కట్టారు..రోజుకోక నేతతో ప్రచారం హోరును పెంచింది బీజేపీ..గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎల్లుండి కీలకం కానుంది. నవంబర్‌ 29న ప్రచారం ముగియనుండటంతో అంతకు ముందు రోజే ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీలు అగ్రనేతల కార్యక్రమాలు ప్లాన్‌ చేశాయి. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ జరగనుండగా..అదే రోజే సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని పర్యటించనుండం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

ప్రధాని మోడీ రేపు హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను పరిశీలించేందుకే ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారని చెబుతున్నాLB స్టేడియంలో KCR బహిరంగ సభ ఉన్న సమయంలోనే మోడీ కార్యక్రమం ఉండటంతో TRSకు కౌంటర్‌గానే బీజేపీ ప్రధాని టూర్‌ను ప్లాన్‌ చేసిందనే చర్చ జరుగుతోంది..గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోడీకి నేరుగా సంబంధం లేకపోయినా హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది..సాధారణంగా ప్రధానికి సంబంధించిన ఏ పర్యటన అయినా రెండువారాల ముందు ఖరావుతుంది. కానీ, ఈ టూర్‌ ఆకస్మికంగా ఖరారైంది. దీంతో, మోడీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. కేసీఆర్‌ సభతో ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌కు కౌంటర్‌గానే ప్రధాని పర్యటనను బీజేపీ ప్లాన్‌ చేసి ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది..మరోవైపు ఇవాళ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నరు..నిమ్మ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌..మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లో తీసుకువెళ్లేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమ భుజాలపైకి ఎత్తుకున్నాయి.

టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచాయి..టీఆర్‌ఎస్ పార్టీ కీలక నేతలు ఇప్పటికే తమ అనుచరులతో గ్రేటర్‌లో ప్రచారంలో పాల్గొంటున్నారు..ఉదయం నుంచే తమ ప్రచారాన్ని ప్రారంభించి..రాత్రి వరకూ ప్రజల్లోనే ఉంటున్నారు..ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను టీఆర్‌ఎస్‌ నేతలు శాంతియుతంగా సమాధానాలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు..గ్రేటర్‌ ఎన్నికలను నాయకత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ రోజులో ఎక్కువ సమయం రోడ్ షోలు, కుల సంఘాల మీటింగ్‌తో పాటు నగరంలో ఉన్న వ్యాపార వేత్తలు, టెక్కీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు..ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కేటీఆర్ తన దైన శైలిలో దూసుకుపోతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో అగమ్యగోచరంగా మారింది..రాష్ట్ర నాయకత్వంలో సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తుంది..రేవంత్‌ రెడ్డి మినహా మిగత నాయకులు ప్రచారంలో చురుగ్గా పాల్గొనేకపోతున్నారు..అసంతృప్త నేతలను బుజ్జగించాడానికే రాష్ట్ర నాయకత్వానికి సమయం సరిపోవడం లేదు..చాలా మంది సీనియర్‌ నాయకులు ఇప్పటికే పార్టీ మారగా మరికోంత మంది అదేబాటలో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ మానసికంగా ఆందోళనలో ఉంది..పార్టీ నేతల నుంచి ఎవరి నుంచి ఎప్పుడు ఎలాంటి వార్త వినవల్సి వస్తుందోనన్న టెన్షన్‌లో టీపీసీసీ నేతలు ఉన్నారు..కాంగ్రెస్‌లో అసంతృప్తులను ఆకర్షించడానికి బీజేపీ ఆఫరేషన్ ఆకర్ష్‌ ను వేగవంతం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version