ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ఈ నెల 18న సినిమా విడుదలై విజయం సాధించిన సందర్భంగా ప్రసాద్‌ల్యాబ్స్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…
డైరెక్టర్ మాట్లాడుతూ… ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఈ సినిమాకి గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. హార్డ్ వర్క్ తోనే ఇది కంప్లీట్ అయింది. థ్యాంక్స్ టు ఎవర్‌గ్రీన్.
పద్మనాభరెడ్డి మాట్లాడుతూ… ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు చాలా హెల్ప్ చేశారు. రిలీజ్‌కి ముందు కొంచం కష్టంలో ఉన్నప్పుడు నేను టేకప్ చేశాను. ఈ సినిమా పేట్రియాటిక్ మూవీ కావడంతో ఒక ఇండియన్‌గా నేను చాలా త్వరగా స్పందించాను. ఈ మూవీ చాలా ఎమోషనల్‌కి గురవుతారు. మనందరం ఈ సినిమాని నిలబెట్టడం. పేట్రియాటిక్ ఫిల్మ్‌ని తప్పకుండా అందరూ నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా రీచ్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ.. నిన్న రిలీజ్ అయింది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది నా పాత్ర బావుందన్నారు. నేను చాలా హ్యాపీ. సినిమాకూడా ఇదొక ఎటెంప్ట్ అనే చెప్పాలి. ఈ సినిమా తీసేటప్పుడు నేను చాలా గర్వంగా ఫీలయి చేశాను. చూసినవాళ్ళందరూ యునామినస్‌గా మూవీ బావుందన్నారు. కలెక్షన్స్ అన్నీ అన్ని చోట్లా చాలా బావుంది.
హీరో కార్తిక్ మాట్లాడుతూ… ఈ రోజుల్లో సినిమా తియ్యడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చెయ్యడం ఒక ఎత్తు. నేను సినిమా చూశాక అందరి క్యారెక్టర్లు బావుంది. రివ్వ్యూ ఒక ఒన్ వీక్ ఆగి రాయండి. సినిమాని బ్రతికించండి. చాల మంచి సినిమా తీశాం. అందరూ సపోర్ట్ చెయ్యండి. మంచి సినిమాలను దయచేసి సపోర్ట్ చెయ్యండి.