ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో గల కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీఎస్ రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్ రెడ్డి, సీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు.
అయితే, సాయంత్రం జరిగే మాక్ డ్రిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే రక్షణ విభాగాలకు వ్యూహాత్మక కేంద్రంగా హైదరాబాద్ ఉన్నందున భద్రతాపరమైన చర్యలకు ఆదేశించనున్నట్లు సమాచారం.