ఉగ్రవాదం అంతం కావాల్సిందే.. భారతీయుడిగా గర్విస్తున్నా : మాజీ సీఎం కేసీఆర్

-

పహెల్గాం ఉగ్రదాడికి భారత్.. పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గత అర్థరాత్రి మిసైల్ అటాక్స్ చేసి సుమారు 80 మంది ఉగ్రవాదులను అంతమొందించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ ఆర్మీని భారతీయులు కొనియాడుతున్నారు.ప్రధాని మోడీ ఇచ్చిన మాట నెరవేర్చారని మెచ్చుకుంటున్నారు.

తాజాగా ‘ఆపరేషన్ సిందూర్‌’పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతం కావాల్సిందేనని.. భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను.ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదు.

ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి.భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోం అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news