పహెల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గత అర్థరాత్రి మిసైల్ అటాక్స్ చేశారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా.. 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. పలువురు ఈ దాడుల్లో గాయపడినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, భారత్ దాడులకు నిరసనగా పాక్ LoC వద్ద మరోసారి కాల్పులు జరిపింది. పాక్ ఆర్మీ కాల్పుల్లో అమాయకులైన పౌరులు మరణించారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాక్ మిలిటరీ జమ్మూకశ్మీర్ పౌరులపై దాడిచేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని తెలిపారు. కాగా, ఆపరేషన్ సిందూర్ పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.