ఏపీలో ఆప‌రేష‌న్ టీడీపీ… గేమ్ రెడీ చేసిందెవ‌రు…!

-

ఏపీలో ప్ర‌స్తుతం వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పార్టీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 22 మంది ఎంపీల‌తో వైసీపీ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మ‌రోవైపు జ‌గ‌న్ ఐదారు నెల‌ల్లోనే ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌తో ప‌రిపాల‌న‌ను దూసుకు వెళుతున్నాడు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీ అస‌లు వైసీపీకి పోటీయే కాదు. ఇప్ప‌టికే టీడీపీని వీడుతోన్న చాలా మంది కీల‌క నేత‌లు అటు బీజేపీలోకో లేదా వైసీపీలోకో వెళుతున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఎటొచ్చి టీడీపీ నుంచి గెలిచిన నేత‌లు పార్టీ మారాలంటే మాత్రం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల్సిందే.

ఇక వీళ్ల‌కు బీజేపీ మంచి ఆప్ష‌న్‌గా ఉంది. ఇక ఏపీలోనూ ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ ఇప్పుడు ముందుగా టీడీపీ మీద ప్ర‌ధానంగా కాన్‌సంట్రేష‌న్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం ముందుగా టీడీపీని అడ్డంగా తొక్కేయండి… ఆ త‌ర్వాత వైసీపీ గురించి ఆలోచ‌న చేద్దాం అని ఏపీ బీజేపీ కీల‌క నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీని మ‌రింత దెబ్బ కొట్టేందుకు అమిత్ షా ప్లాన్ రెడీ చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

క‌శ్మీర్‌, అయోధ్య లాంటి స‌మ‌స్య‌లు ఒక్కొక్క‌టిగా ముగుస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో బీజేపీని ఏపీ,తెలంగాణ‌లో పార్టీని స్ట్రాంగ్ చేయ‌డం ఒక్క‌టే మిగిలి ఉంది. ఇక ఇప్ప‌టికే ప్రారంభ‌మైన ఆప‌రేష‌న్ టీడీపీ నేప‌థ్యంలోనే టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు రెండు రోజులుగా టీడీపీ సీనియర్ మాజీ మంత్రి గంటా ఢిల్లీలో మకాం వేసిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో పాటు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. గంటాతో పాటు మ‌రో ఐదారుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయిన‌ట్టు టాక్‌..?

ఒక‌రిద్ద‌రు పార్టీ మారితే ఖ‌చ్చితంగా ఇప్పుడు జ‌గ‌న్ వారిపై అన‌ర్హ‌త వేటు వేయిస్తాడు. అలా కాకుండా టీడీపీలో టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో మెజార్టీ స‌భ్యుల‌తో స‌హా బీజేపీలోకి జంప్ చేస్తే అలాంటి వేడు ప‌డ‌దు. అయితే గంటా ఆధ్వ‌ర్యంలో ఆప‌రేష‌న్ స్కెచ్ న‌డుస్తుంటే మ‌రోవైపు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, అమిత్ షా వైసీపీలో చేరేందుకు రెడీ అవుతోన్న టీడీపీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌ద్ద‌ని వైసీపీ అధిష్టానానికి చెప్పిన‌ట్టు కూడా ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం న‌డుస్తోంది.

అందుకే ఇప్పుడు వీళ్ల‌కు వైసీపీ డోర్లు మూసేస్తే త‌మ వ్యాపార‌, రాజ‌కీయ అవ‌స‌రాల కోసం వీరు బీజేపీనే ఆశ్ర‌యించాలి. అప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా టీడీపీ ప్లేస్‌లోకి బీజేపీ వ‌చ్చేస్తే టీడీపీ మ‌టాష్ అయిపోతుంద‌న్న‌దే అమిత్ షా ప్లాన్ అట‌. ఏదేమైనా ఏపీలో టీడీపీని భూస్థాపితం చేయ‌డ‌మే టార్గెట్‌గా అమిత్ షా పెద్ద ఎత్తున పావులు క‌దుపుతున్నట్టే తెలుస్తోంది. ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో ఐదారు నెల‌ల్లో కీల‌క మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version