చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో భారత్‌లో అతి తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ఫోన్‌ను విడుదల చేసింది. అదే Oppo A18. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌లో యుఎఇలో లాంచ్ చేశారు. అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో ఇండియాలోనూ రిలీజ్ చేశారు. ఇది ఆక్టా-కోర్ MediaTek Helio చిప్‌సెట్ ద్వారా వస్తుంది. మంచి బ్యాటరీ, కెమెరా ఉంది. Oppo A18 ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
భారతదేశంలో Oppo A18 ధర :
4GB + 64GB వేరియంట్ ధర కేవలం రూ.9,999 ఉంది. ఈ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. Oppo ఆన్‌లైన్ స్టోర్, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Oppo A18 ఫీచర్లు :
Oppo A18 స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల HD+ (1,612 x 720 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను అందించారు.
90Hz రిఫ్రెష్ రేట్‌తో తీసుకొచ్చారు, 720 నిట్స్ ఉంది.
ఇది ఆక్టా-కోర్ MediaTek Helio G85 SoC ద్వారా పనిచేస్తుంది
Android 13-ఆధారిత ColorOS 13.1ని అమలు చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, Oppo A18లో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ సెటప్‌ను అందించారు.
సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీ ఉంది.
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS మరియు USB టైప్-C ఉన్నాయి.
ఇది 3.5 mm ఆడియో జాక్‌తో వస్తుంది.
పది వేలకే ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు అంటే గ్రేటే. ఒప్పో అంటేనే సెల్ఫీ ఎక్స్‌పర్ట్. బడ్జెట్‌లో తీసుకోవాలంటే ఈ ఫోన్ మంచి ఎంపికే.