జుట్టు బాగా రాలిపోతుందా..? కలబందను ఇలా వాడితే హెయిర్‌ అస్సలు ఊడదు

-

జుట్టు సమస్యలు లేని మనిషి ఉండటం లేదు. ఏం చేసినా ఏదో ఒక సమస్య ఉంటుంది. వయసుతో సంబంధం లేదు, జెండర్‌తో పని లేదు. తాతలు ఇచ్చిన ఆస్తులు కాపాడుకోవడం గ్రేట్‌ కాదు, 30 ఏళ్ల వరకూ జుట్టును కాపాడుకోవడం గ్రేట్‌ అన్నట్లు మారిపోయింది. జుట్టు కుదుళ్ల‌కు పోష‌కాలు సరిగ్గా అందక అవి బ‌ల‌హీనప‌డి జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి మ‌న‌లో చాలా మంది బ‌ట‌య మార్కెట్‌లో ల‌భించే నూనెల‌ను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపుల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేక తీవ్ర నిరాశ‌కు గురి అవుతూ ఉంటారు. జుట్టు రాలే స‌మ‌స్య‌కు క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది. క‌లబంద‌లో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు జుట్టు కుదుళ్ల‌కు కావ‌ల్సిన పోష‌ణను అందించి కుదుళ్లు గ‌ట్టి ప‌డేలా దోహ‌దం చేస్తాయి. క‌ల‌బందను వాడ‌డం వల్ల ఎటువంటి చెడు ప్ర‌భావం కూడా ఉండ‌దు. జుట్టు రాల‌డంతో బాధ‌ప‌డే వారు స‌హజంగా ల‌భించే ఈ క‌ల‌బంద‌తో కొన్ని చిట్కాల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

మ‌న‌కు త‌ల‌కురాసుకునే నూనెను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా 5 టేబుల్ స్పూన్ల నూనెను గిన్నెలోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేయండి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నెను ప‌క్క‌కు తీసి అందులో 3 టేబుల్ స్పూన్ల క‌ల‌బంద గుజ్జు వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న నూనెన రాత్రి ప‌డుకునే ముందు జుట్టుకు బాగా ప‌ట్టించాలి. నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేయాలి. దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం క్ర‌మంగా త‌గ్గుతుంది.

ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. త‌రువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ర‌సాన్ని వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌ర్ల వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే క‌ల‌బంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్ల‌పై కూడా రాయ‌వ‌చ్చు. జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వాలి. త‌రువాత క‌లబంద గుజ్జును నేరుగా జుట్టు కుదుళ్ల‌పై రాసి మ‌ర్ద‌నా చేయాలి. ఒక గంట త‌రువాత షాంపుతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల జుట్టు కుదుళ్లు బ‌ల‌ప‌డి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. ఈ విధంగా క‌ల‌బంద‌ను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version