మొబైల్స్ తయారీదారు ఒప్పో ఎఫ్17 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను గురువారం భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.4 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 16 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇందులో ఉంది. 4015 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి ఫ్లాష్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అందువల్ల ఫోన్ కేవలం 56 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
ఒప్పో ఎఫ్17 స్పెసిఫికేషన్లు…
* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2400 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
* 16, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4015 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్
ఒప్పో ఎఫ్17 స్మార్ట్ ఫోన్ నేవీ బ్లూ, క్లాసిక్ సిల్వర్, డైనమిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,990 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,990గా ఉంది. ఈ నెల 21 నుంచి ఈ ఫోన్ ను విక్రయిస్తారు.
ఈ ఫోన్‌ను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్, క్రెడిట్ కార్డులపై 7.5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం పొందవచ్చు. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొంటే 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొంటే రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు.