స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో నూత‌నంగా ఓ స్మార్ట్‌వాచ్‌ను విడుద‌ల చేసింది. ఒప్పో వాచ్ పేరిట ఆ స్మార్ట్‌వాచ్ విడుద‌లైంది. ఒప్పోకు చెందిన మొద‌టి స్మార్ట్‌వాచ్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో గూగుల్ డెవ‌ల‌ప్ చేసిన వియ‌ర్ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. 46ఎంఎం డిస్‌ప్లే సైజులో ఈ వాచ్ ల‌భిస్తుంది. ఇందులో 1.91 ఇంచుల 3డీ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ అందించారు. 41 ఎంఎం వెర్ష‌న్‌లో 1.6 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీనికి కూడా వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. వీటిల్లో స్నాప్‌డ్రాగ‌న్ 3100, అపోలో 3 డ్యుయ‌ల్ ప్రాసెస‌ర్లు ఉన్నాయి. వైఫైకి స‌పోర్ట్‌ను ఇస్తున్నారు. కానీ యాపిల్ వాచ్ త‌ర‌హాలో ఇ-సిమ్‌కు స‌పోర్ట్ లేదు.

అల్యూమినియం, ర‌బ్బ‌ర్ స్ట్రాప్‌ల‌తో ఈ వాచ్‌ను అందిస్తున్నారు. వూక్ ఫ్లాష్ చార్జ్ టెక్నాల‌జీ ఉన్నందున వాచ్ వేగంగా చార్జింగ్ అవుతుంది. 41ఎంఎం వేరియెంట్ 0 నుంచి 100 శాతం చార్జింగ్‌కు కేవ‌లం 75 నిమిషాల స‌మ‌య‌మే ప‌డుతుంది. అదే 46ఎంఎం వాచ్ అయితే 0 నుంచి 46 శాతం చార్జింగ్‌కు 15 నిమిషాలు ప‌డుతుంది.

ఒప్పో వాచ్‌లో 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, బారోమెట్రిక్ ప్రెష‌ర్ సెన్సార్‌, ఆప్టిక‌ల్ హార్ట్ రేట్ సెన్సార్‌, యాక్టివిటీ ట్రాక‌ర్‌, వియ‌ర్ ఓఎస్‌, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ క‌నెక్టివిటీ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, జీపీఎస్‌, ఎన్ఎఫ్‌సీ, 24 నుంచి 36 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

41 ఎంఎం ఒప్పో వాచ్ ధ‌ర రూ.14,990 ఉండ‌గా, 46 ఎంఎం వాచ్ ధ‌ర రూ.19,990గా ఉంది. అమెజాన్‌లో ఆగ‌స్టు 10 నుంచి వీటిని విక్ర‌యిస్తారు. ప్రీ ఆర్డ‌ర్లు చేసే వారికి రూ.500 డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version