ఆగస్టు తర్వాత రుణ వాయిదాలపై మారటోరియాన్ని పొడగించాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. మారటోరియాన్ని మరింత కాలం పొడగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన తెలిపారు. చాలా మంది బ్యాంకర్ల అభిప్రాయం కూడా తమలాగానే ఉందని ఆయన అన్నారు.
మారటోరియాన్ని పొడగించవద్దని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను కోరిన హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్ దీపక్ పారేఖ్‌తో రజనీశ్ ఏకీభవించారు. ఈ త్రైమాసిక ఫలితాల్లో ఎస్‌బీఐ అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.4,189.34 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వార్షికంగా చూస్తే ఇది 81% పెరుగుదల కావడం గమనార్హం. ఎస్‌బీఐ ఏకీకృత ఆదాయం గతేడాది ఇదే సమయంలో రూ.70,653.23 కోట్లతో పోలిస్తే ఈ సారి రూ.74,457.86కు పెరిగింది.