జులై 13, 14 తేదీలలో బెంగళూరులో విపక్షాల భేటీ

-

జులై 13, 14 తేదీలలో బెంగళూరులో విపక్షాల భేటీ జరుగనుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధికార బిజెపిని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగుళూరులో సమావేశం కానున్నాయి. తోలుత సిమ్లాలో భేటి నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగుళూరుకి మార్చారు. జూలై 13, 14వ తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సిపి చీఫ్ శరత్ పవర్ వెల్లడించారు.

పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈసారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరు బాట, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వాక్యాలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసిసిపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version