నీకు దమ్ముంటే.. టెక్కలి అంబేడ్కర్‌ దగ్గరకు రా.. అచ్చెన్నాకు దువ్వాడ సవాల్‌

-

నీకు దమ్ముంటే.. టెక్కలి అంబేడ్కర్‌ దగ్గరకు రా.. అంటూ తెదేపా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సవాల్‌ విసిరారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ‌.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సమస్యల పై ధ్వజమెత్తుతున్న అచ్చన్నాయుడు నీకు దమ్ముంటే నీ, నా నియోజకవర్గాలలో తేల్చుకుందాం వస్తావా అని ప్రశ్నించారు.

మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నేటి వరకు మన టెక్కలి…నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఎంత లబ్ది చేశామో చూద్దామమన్నారు. మాట్లాడితే మేనిఫెస్టోను బైబిల్ అంటూ ఎద్దేవా చేస్తున్నావ్… నీకు మేనిఫెస్టో అండమే రాదు..అసలు నీకు బైబిల్ కు మేనిఫెస్టో కు మధ్య తేడా తెలుసా అని ప్రశ్నించారు.

మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధాలతో పోల్చుతూ మా నాయకుడు చప్పిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడన్నారు. మీ 40 ఏళ్ల పాలనలో మీ మేనిఫెస్టో గ్రంధాల మాదిరి ముద్రించడం తప్ప చేసింది ఏమి లేదని విమర్శలు చేశారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ‌. నీ బాషా ప్రావీణ్యంతో మా శ్రీకాకుళంజిల్లా పరువు తీస్తున్నావ్ కదరా అంటూ రెచ్చిపోయారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version