హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అసిఫ్ నగర్‌లో ట్రాఫిక్ పోలీసులకు, వాహనదారులకు మధ్య వాగ్వాదం నెలకొంది.
చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులకు గురిచేయడంతో వారు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో తమ మాట వినని వారిపై ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకుంటూ, దౌర్జన్యం చేస్తున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అసిఫ్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులకు మధ్య వాగ్వాదం
సామాన్యులపై ట్రాఫిక్ పోలీసుల జులుం
చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వాహనదారులను ఇబ్బందులు
మాట వినని వారిపై చేయి చేసుకుంటూ, దౌర్జన్యం.. pic.twitter.com/4ALb5tGcK2
— Telangana Awaaz (@telanganaawaaz) March 3, 2025