రేవంత్‌ కు ఝలక్‌.. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం !

-

రేవంత్‌ కు ఝలక్‌.. కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల సాధనకై పోస్ట్‌కార్డ్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యాకర్తల నుంచి సేకరించిన 10 వేల పోస్ట్‌కార్డ్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు ఎమ్మెల్సీ కవిత.

kavitha revanth

10 వేల పోస్ట్‌కార్డ్‌లను సేకరించి పంపిస్తున్నామని… హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని ఈ సందర్భంగా ప్రకటన చేశారు. లక్షలాది పోస్ట్‌కార్డ్‌లను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని… మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని ఆగ్రహించారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version